క్యాచీగా ఆంధ్ర కింగ్ తాలూకా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ అనే నాలుగో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక స్టార్‌ హీరో సినిమా రిలీజ్‌ రోజున అభిమానులు చేసే వేడుకలు ఎలా ఉంటాయో మనకు ఈ పాటలో చూపించారు. రామ్‌ తన అద్భుతమైన డ్యాన్స్‌ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ పాటకు విభిన్నమైన హుక్‌ లైన్‌, ఎనర్జీతో కూడిన బీట్‌లు హైలైట్‌గా నిలిచాయి.

వివేక్‌-మెర్విన్‌ సంగీతం అందించిన ఈ పెప్పీ నంబర్‌‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.

Exit mobile version