‘స్పిరిట్’లో మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి..!

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన తన నెక్స్ట్ చిత్రంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వాటిలో మెగాస్టార్ చిరంజీవి ఈ ‘స్పిరిట్’ చిత్రంలో నటించబోతున్నాడని.. ప్రభాస్ తండ్రి పాత్రలో ఆయన కనిపిస్తాడనే వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా సందీప్ రెడ్డి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘స్పిరిట్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడనే విషయం కేవలం రూమర్ అని ఆయన తేల్చి చెప్పాడు.

దీంతో ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version