నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది.
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందో బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి 5 రోజుల్లో బుక్ మై షోలో ఏకంగా 2,50,000 టికెట్ బుకింగ్స్ జరిగాయంటే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది.
ఈ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ మరో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి ప్రొడ్యూస్ చేశారు.
