సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ గా అందరికీ రిజిస్టర్ అయ్యిపోయింది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్ ని చేస్తుండగా ఈ భారీ ఈవెంట్ కి గ్లోబల్ లెవెల్లో కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి.
ఆల్రెడీ ఈ ఈవెంట్ ని లైవ్ లో దుబాయ్ లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ వారు నిర్మాణం ప్రకటించారు. దుబాయ్ లోని అల్ గురైర్ సెంటర్ స్టార్ సినిమాస్ లో లైవ్ స్ట్రీమ్ అది కూడా డాల్బీ సినిమాస్ వెర్షన్ లో ప్రదర్శితం కానున్నట్టు తెలిపారు. ఇక కేవలం ఒక లాంచ్ ఈవెంట్ కే ఈ రేంజ్ ప్లానింగ్ లు చేస్తున్నారంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాల్సిందే.
