ధర్మేంద్ర డియోల్ ఆరోగ్యంపై గుడ్ న్యూస్!

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర డియోల్ విషయంలో నిన్న పలు రూమర్స్ బయటకొచ్చి ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్తలపై తమ కుటుంబీకులు ఆ వార్తలని కొట్టి పడేసి ధర్మేంద్ర బాగానే ఉన్నారని తెలిపారు. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశంపై మరో క్లారిటీ బయటకి వచ్చింది. దీనితో ధర్మేంద్ర మరియు డియోల్ కుటుంబ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

దీని ప్రకారం ధర్మేంద్ర కోలుకున్నారని. ఈ తర్వాత డిశ్చార్జ్ కూడా అయ్యి ఇంటికి వెళ్లినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇంటి నుంచే తాను క్రమంగా వైద్యం తీసుకుంటూ కోలుకుంటారని వారు చెబుతున్నారట. దీనితో డియోల్ కుటుంబం అభిమానులకి తమ వెల్ విషర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ న్యూస్ తో బాలీవుడ్ ఆడియెన్స్ సహా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version