మన తెలుగు సినిమా దగ్గర చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉండొచ్చు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకి ఉన్న క్రేజ్ కానీ మార్కెట్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళు నుంచి వీరి హవా మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తుంది. ఇక వీరికి ఒక్క సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు.
మరి అలాంటి సినిమాల తాలూకా మాస్ హైప్ నే వారి ఫ్యాన్స్ ఇప్పుడు చూసారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఓజి సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో కానీ ఆఫ్ లైన్ లో గాని దాని రీచ్ ఊహించని రేంజ్ లో ఉండేది. వర్ణించడానికి కూడా వీలు లేని తరహా ఫీల్ లో పవన్ ఫ్యాన్స్ ఒక వెర్రి ఆనందంతో ఉండేవారు.
మరి సరిగ్గా అలాంటి మీటర్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఇన్నాళ్లు సరైన అప్డేట్స్ లేక డల్ గా ఉన్న ఫ్యాన్స్ లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మాస్టర్ ప్లానింగ్ సరికొత్త ఊపు తీసుకొచ్చింది. ఓజి లానే సడెన్ గా వస్తున్న అప్డేట్ డైరెక్ట్ గా సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్నాయి.
ఇక ఈ పోస్ట్ ల తాలూకా రీచ్ కూడా గట్టిగానే కనిపిస్తుంది. ఇలా అప్పుడు పవన్ ఫ్యాన్స్ అనుభవించిన నెక్స్ట్ లెవెల్ హై ని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం ఇప్పుడు లేదు.
