విడుదల తేదీ : నవంబర్ 09, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
ప్రసార వేదిక: ఈటీవీ విన్
నటీనటులు: కార్తికేయ పివికే, రాశి, శంకర్ మహంతి, మహేంద్ర గణాచార్య్, మేఘన తదితరులు
దర్శకత్వం: కార్తికేయ పివికే
నిర్మాతలు: ఆర్ ఆర్ టాకీస్
సంగీతం: ఈశ్వర్ చంద్
ఛాయాగ్రహణం: చరణ్ మెసల్
కూర్పు: శ్రీకాంత్ పట్నాయక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రతీ వారం స్ట్రీమింగ్ కి వచ్చే కథా సుధ కొత్త లఘు చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన లఘు చిత్రమే విజయ్ కేరాఫ్ రామారావు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
సిటీలో వి ఎఫ్ ఎక్స్ డిజైనర్ గా కొంచెం బిజీ లైఫ్ ని ఫ్యామిలీతో లీడ్ చేసే విజయ్ (కార్తికేయ) ఇంటికి ఓ రెండు నెలలు ఉండేందుకు తన తాత రామారావు (శంకర్ మహంతి) వస్తారు. ఆయన పాత కాలం మనిషి కావడం మూలాన కొన్ని విషయాల్లో పకట్బందీగా నిర్మొహమాటంగా ఉంటారు. తన భార్య చనిపోయాక వీరితో కొన్నాళ్ళు కలిసి ఉండాలని వచ్చిన రామారావుకి తన మనవడికి జరిగిన ఘర్షణ ఏంటి? ఎందుకు తన తాతని విజయ్ వెనక్కి వెళ్ళిపోమంటాడు. విజయ్ ని రామారావు అడిగిన కోరిక ఏంటి? దానిని తాను తీర్చాడా లేదా? ఈ కథ ద్వారా ఇచ్చిన సందేశం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఒకింత డీసెంట్ ఫీల్స్ ఇస్తుంది. అక్కడక్కడా చిన్న ఫన్ సీన్స్ ఇంకా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సన్నివేశాలు ఫ్రెష్ గా తేలికగా అనిపిస్తాయి. అలానే ఎమోషనల్ పార్ట్ వరకు కూడా కొన్ని చోట్ల బానే ఉంది.
నటుడు శంకర్ మహంతి మంచి రోల్ లో మంచి నటన కనబరిచారు. పాత కాలపు మనిషిగా పక్కాగా తాను మెప్పించారు. అలాగే తన మనవడిగా కనిపించిన కార్తికేయ కూడా తన రోల్ లో బాగా చేసాడు. అలాగే రాశి, మహేంద్రాలు తమ రోల్స్ పరిధి మేరకు బానే చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కొంతమేర వరకు సీన్స్ పర్వాలేదు కానీ తర్వాత మాత్రం రొటీన్ గానే వెళుతుంది. మరింత బలమైన ఎమోషన్స్ ని ఇందులో ప్రెజెంట్ చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత బాగుండి ఉండేది. మొదటి 10 నుంచి 15 నిమిషాలు కథనం బానే వెళ్ళింది కానీ తర్వాత అంశాలు మాత్రం ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తాయి.
మెయిన్ గా ఈ కథా సుధలో ఎపిసోడ్స్ ని ఫాలో అవుతున్న వారికి ఇంకా రొటీన్ గానే అనిపించవచ్చు. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా అంత బలంగా అనిపించలేదు. చెప్పాలనుకున్న సందేశాన్ని మరింత బెటర్ పరిస్థితులని డైలాగ్స్ ని డిజైన్ చేసుకొని ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.
వీటితో పాటుగా కథనం కూడా కొంచెం స్లోగా సాగుతూ వెళుతుంది. రాశికి కూడా తన నటన పరంగా ఈ సినిమాలో పెద్దగా స్కోప్ ఉన్నట్టుగా అనిపించలేదు. ఆమె స్థానంలో వేరే ఏ కొత్త నటి అయినా సెట్ అయిపోతారు అనేంత సింపుల్ గానే ఉంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లీన్ సెటప్ తో మొత్తం ప్రెజెంట్ చేశారు. సంగీతం, కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఇక కార్తికేయ నటుడుగా మెప్పించాడు కానీ దర్శకత్వంలో బెటర్ గా ట్రై చేయాల్సింది. ఇంకా మంచి డైలాగులు, ఎమోషన్స్ ని ప్లాన్ చేసుకొని ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫీల్ ని కలిగించి ఉండేది. కానీ కొన్ని మూమెంట్స్ ని మాత్రం బానే హ్యాండిల్ చేసాడు.
తీర్పు
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ విజయ్ కేరాఫ్ రామారావు అనే లఘు చిత్రం కొంతమేరకు ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడా ఎమోషన్స్, మొదటి కొంతసేపు బాగుంది. కానీ మనం ఇష్టపడేవారు లేదా మనల్ని ఇష్టపడేవారు ఉన్నపుడే వారితో విలువైన సమయాన్ని గడపాలి వారు లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు అనే పాయింట్ ని ఇంకా ఎఫెక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది కానీ అది మిస్ అయ్యింది. సో ఈ సినిమా బిలో యావరేజ్ ట్రీట్ ఇస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
