కాసులు కురిపిస్తున్న ‘కాంచన 4’

యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన ‘కాంచన’ సిరీస్ హార్రర్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తీసిన ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక కాంచన సిరీస్‌లతో డైరెక్టర్‌గా తన సత్తా చాటాడు లారెన్స్.

కాంచన సిరీస్‌తో లారెన్స్‌ హారర్ కామెడీకి కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చాడు. కాంచన 3 తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు ‘కాంచన 4’తో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే లారెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాడు.

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్పుడే కాసులు కురిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘కాంచన 4’ కళ్లు చెదిరే బిజినెస్‌ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల రూపంలో రూ.50 కోట్లు, హిందీ రైట్స్‌ మరో రూ.50 కోట్లకు అమ్ముడు కావడంతో ఈ మూవీ అప్పుడే వంద కోట్ల బిజినెస్ చేసిపెట్టింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ మూవీకి నార్త్‌లో స్టన్నింగ్ రెస్పాన్స్ రావడం ఖాయమని సినీ సర్కిల్స్ అంటున్నాయి.

Exit mobile version