‘ఓజి’ జపాన్ రిలీజ్ ప్లాన్ ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డ్ వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి జపాన్ లో రిలీజ్ చేసే స్కోప్ తప్పంకుండా ఉంది. పైగా దర్శకుడు సుజీత్ గత సినిమా సాహో కూడా అక్కడ విడుదల అయ్యింది. ఓజి సినిమాలో అయితే జపనీస్ నేపథ్యం ఆ యాక్షన్ డెఫినెట్ గా అక్కడ ఆడియెన్స్ కి కూడా నచ్చే ఛాన్స్ ఉంది.

అయినప్పటికీ ఈ సినిమా అక్కడ విడుదల చేసే ప్లాన్ లు మేకర్స్ ఉన్నాయో లేదో అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇప్పటికే మన తెలుగు నుంచి ఎన్నో సినిమాలు జపాన్ లో విడుదల అయ్యాయి. అక్కడి నేపథ్యంతో కనెక్టివిటీ లేని సినిమాలే ఎన్నో మంచి ఆదరణ అందుకున్నాయి.

అలాంటిది సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్న ఓజి విడుదల అయితే బెటర్ గా పెర్ఫామ్ చేయదు అని చెప్పడానికి లేదు. మరి ఫ్యూచర్ లో అయినా ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version