ఇండియన్ సినిమా దగ్గర హారర్ థ్రిల్లర్ సినిమాలు ఒకింత తక్కువే. కామెడీ కలిపేసి ఇప్పుడు వస్తున్నాయి కానీ ప్రాపర్ హారర్ సినిమాల లిస్ట్ లో మాత్రం తక్కువే కనిపిస్తాయి. అలాంటి తక్కువ సినిమాల్లో కూడా డెఫినెట్ గా ఉండే సినిమా అందులో మన తెలుగు సినిమా “అరుంధతి” కూడా ఒకటి. మరి ఈ సినిమాకి రీమేక్ కోసం తెలుగు బ్యూటీ శ్రీలీల లాక్ అయినట్టు వచ్చిన టాక్ వైరల్ అవుతుంది.
అదేంటి ఆల్రెడీ తెలుగు సినిమా మళ్లీ తెలుగు హీరోయిన్ తో రీమేక్ అనుకుంటున్నారా? ఇది తెలుగు లో కాదు హిందీలో సినిమాకి అట. హిందీలో ఎప్పుడు నుంచో పలువురు స్టార్ హీరోయిన్స్ తో అరుంధతి రీమేక్ కి ప్లాన్స్ జరిగాయి. కాని అది ఫైనల్ గా శ్రీలీల వరకు వచ్చింది అంటూ కొత్త రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి.
