తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘డ్యూడ్’ మంచి అంచనాల మధ్య అక్టోబర్ 17న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ అయింది. కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా దీపావళి పోటీలో రిలీజ్ అయినా, ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 575K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకెళ్తోంది. ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ మూవీ సాలిడ్ వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటించగా సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.