ట్విస్ట్.. ‘రాజా సాబ్’ సౌండ్ లేదా?

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలానే హీరోయిన్ రిద్ధి కుమార్ లతో దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. భారీ విజువల్స్ తో కూడిన సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సాంగ్ తాలూకా షూట్ కూడా లేటెస్ట్ గానే మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇంకోపక్క ప్రభాస్ ఫ్యాన్స్ కి తమ హీరో పుట్టినరోజు దగ్గరకి వచ్చేస్తుండడంతో ఫస్ట్ సింగిల్ కోసం మరింత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

కానీ లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ బర్త్ డే కి రాజా సాబ్ నుంచి సౌండ్ ఉండకపోవచ్చనే వినిపిస్తుంది. సాంగ్ కి సంబంధించి పనులు ఇంకా పూర్తి కానందున ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ అనుమానమే అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తేలాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version