‘లోక’ ఓటిటి ఎంట్రీకి రెండు డేట్స్?

Kotha-Lokah

ఈ ఏడాది మలయాళ సినిమా నుంచి వచ్చిన పలు సాలిడ్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే “లోక చాప్టర్ 1”. ఒక సరికొత్త సూపర్ హీరోగా చేసిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర మరో రేర్ సూపర్ హీరో సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ మంచి సస్పెన్స్ గా మారింది అని చెప్పాలి.

కొన్ని రోజులు కితమే జియో హాట్ స్టార్ వారు ఈ సినిమా అతి త్వరలోనే పాన్ ఇండియా భాషల్లో తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంచారు. అయితే దీనికి రెండు డేట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఈ అక్టోబర్ 23 లేదా 31 నుంచి సినిమా స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించారు.

Exit mobile version