ఇండియాస్ బెస్ట్ హారర్ థ్రిల్లర్ కి ఏడేళ్లు.. క్రేజీ పిక్స్ షేర్ చేసిన హీరో

ఇండియన్ సినిమా నుంచి వచ్చిన కొన్ని ఫైనెస్ట్ అండ్ బెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో డెఫినెట్ గా బెస్ట్ సినిమా ఏది అంటే దాదాపు అంతా చెప్పే సినిమా పేరే “తుంబాడ్”. ఇది 2018లో విడుదల అయ్యింది కానీ అప్పుడు అనుకున్న రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ కొన్ని అండర్ రేటెడ్ సినిమాల లిస్ట్ లో ఇది కూడా చేరి నెమ్మదిగా ఆదరణ ఓటిటిలోకి వచ్చాక పొందింది.

ఇలా మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కించగా సోహుమ్ షాహ్ హీరోగా నటించారు. అయితే ఈ జెమ్ చిత్రం థియేటర్స్ లోకి వచ్చి నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకోవడంతో ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సహా చిత్ర యూనిట్ కూడా తుంబాడ్ కోసం పోస్ట్ లు చేస్తున్నారు.

ఇలా హీరో సోహుమ్ షాహ్ కూడా తుంబాడ్ సెట్స్ నుంచి క్రేజీ పిక్స్ కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. షూటింగ్ కోసం తాము ఎలాంటి సెట్స్ వేశారు. సెట్స్ లోని తన జిమ్ వర్క్ హస్తర్ ప్రొస్థెటిక్ మేకప్ ఇలా పలు మూమెంట్స్ ని తాను పంచుకున్నాడు. దీనితో ఇవి చూసిన ఈ సినిమా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతూ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version