ఫైనల్ గా ‘తెలుసు కదా’ ట్రైలర్ కి టైం ఫిక్స్!

telusu kada

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా ఇంకా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించిన మొదటి చిత్రమే “తెలుసు కదా”. ఓ ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ డ్రామాగా ప్రామిసింగ్ కంటెంట్ తో ఇప్పుడు వరకు ఆకట్టుకున్న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ పట్ల మంచి ఆసక్తి చాలా మందిలో ఉంది. అయితే ఆల్రెడీ వచ్చేయాల్సి ఉన్న ఈ ట్రైలర్ ని మేకర్స్ వాయిదా వేశారు.

మరి ఈ ట్రైలర్ పై ఇప్పుడు ఫైనల్ గా అప్డేట్ బయటకి వచ్చింది. దీనితో ఈ ట్రైలర్ ని మేకర్స్ రేపు అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ ట్రైలర్ కోసం నాగవంశీ తదితరులు బాగా డిస్కస్ చేస్తున్నారు. మరి రేపొచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ దీపావళి కానుకగా చిత్రం ఈ 17న రిలీజ్ కాబోతుంది.


Exit mobile version