ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ “మిరాయ్”

Mirai Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. సాలిడ్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకొని తేజ సజ్జ కెరీర్ లోనే హను మాన్ తర్వాత మరో మంచి హిట్ గా నిలిచింది.

ఇలా థియేటర్స్ లో సాలిడ్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో నేటి నుంచి ఒక్క హిందీ మినహా మిగతా ముఖ్య భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకున్నవారు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version