ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘వార్ 2’.. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “వార్ 2”. మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సాలిడ్ మల్టీస్టారర్ ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు వార్ 2 ని హిందీ, తమిళ్ లో సెపరేట్ గా అలాగే తెలుగులో సెపరేట్ గా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.

కానీ ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే థియేటర్స్ లో 2 గంటల 51 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం 2 గంటల 53 నిమిషాల నిడివితో స్ట్రీమ్ అవుతుంది. మరి సీన్స్ ఏమన్నా యాడ్ చేసారేమో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించగా ఆదిత్య చోప్రా కథ అందించారు.

Exit mobile version