పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్రపై, హీరో పవన్ కళ్యాణ్ గురించి రాశి ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది.
ఈ సినిమాలో అవకాశం గురించి మాట్లాడుతూ.. “ఒక రోజు హరీష్ శంకర్ ఫోన్ చేసి, ‘పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంది, చేస్తావా?’ అని అడిగారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించాను. కథ వినకుండా సైన్ చేసిన సినిమా ఇదే. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలి అనేది నా కల. ఇప్పుడు అది నెరవేరుతోంది” అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి ట్రీట్ ఇస్తుందని.. పవన్ కళ్యాణ్ పేరు లాగే ఆయన వ్యక్తిత్వం కూడా పవర్ఫుల్ అని.. ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన స్వభావం, మానవత్వం మరింత అర్థమయిందని.. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ, ఎన్నో పుస్తకాలు చదువుతుంటారని.. ఈ సినిమాలో ఆయన పార్ట్ పూర్తైందని.. తనకు మాత్రం ఇంకా కొన్ని రోజుల షూట్ మిగిలి ఉందని రాశి ఖన్నా తెలిపింది.