ఈ వారంలో సౌత్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన పలు అవైటెడ్ చిత్రాల్లో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ లు నటించిన సాలిడ్ ఎమోషనల్ చిత్రాలు కాంతార 1 మరియు ఇడ్లీ కొట్టు చిత్రాలు కూడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలకి కూడా ఆయా ఇండస్ట్రీల నుంచి డీసెంట్ టాక్ అయితే దక్కింది.
పాన్ ఇండియా లెవెల్లో కాంతార 1 కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తే.. తమిళ ఇండస్ట్రీ నుంచి ఇడ్లీ కడై కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఒక్క రోజు గ్యాప్ లోనే వచ్చిన ఈ సినిమాకి ఓ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కో ఇన్సిడెంట్ ఉందని చెప్పవచ్చు. అదే.. ఈ రెండు సినిమాలకి కూడా హీరోలే దర్శకత్వ భాద్యతలు తీసుకోవడం.
కథ నుంచి దర్శకత్వం వరకు ఇద్దరూ స్టార్స్ తమ చిత్రాలకి తమ బెస్ట్ వర్క్ ని తమ సినిమాల నేపథ్యానికి తగ్గ క్రాఫ్ట్స్ లో ఇచ్చే పని చేసారని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలకి కూడా వారి దర్శకత్వం పరంగా నెగిటివ్ రిమార్క్స్ కూడా రాలేదు. ఇలా ఇద్దరు హీరోలు సినిమాలు అందులోని తమ దర్శకత్వంలోనే తెరకెక్కించినవి ఒకే వారంలో వచ్చి మంచి టాక్ ని అందుకోవడం విశేషం.