ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మదరాసి”

Madharaasi-OTT

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే “మదరాసి”. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా తమిళ్ లో డీసెంట్ గానే రన్ అయ్యింది. ఇక తెలుగులో కూడా విడుదల అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ పవర్ఫుల్ విలన్ గా నటించారు. అలాగే శ్రీ లక్ష్మీ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version