ఓ ఇంటివాడు కాబోతున్న తెలుగు దర్శకుడు !

‘కార్తీక్ వర్మ దండు’ దర్శకత్వం వహించిన విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కార్తీక్ వర్మ దండు, ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యతో ‘NC 24’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు. అయితే ఈ దర్శకుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా కార్తీక్ దండు నిశ్చితార్థం జరిగింది. కార్తీక్ దండుకి సంబంధించిన నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి.

కార్తీక్ వర్మ దండు, హర్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు. నిన్న ఆదివారం హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య – శోభిత ధూళిపాళ దంపతులు హాజరయ్యారు. అలాగే, సాయి దుర్గ తేజ్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ లతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version