యూట్యూబ్ లో ‘స్కంద’ సినిమా సెన్సేషన్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “స్కంద”. మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ లో కూడా భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా మొత్తంగా 380 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషం. మరి ఇదంతా హిందీ వెర్షన్ లోనే కావడం విశేషం.

రామ్ చిత్రాలకి యూట్యూబ్ హిందీ వెర్షన్ లో భారీ రెస్పాన్స్ లు వచ్చాయి. మరి అలానే ఇపుడు స్కంద చిత్రం కూడా మొత్తం నాలుగు అఫీషియల్ పార్ట్నర్ యూట్యూబ్ ఛానల్స్ కి కలిపి 380 మిలియన్ పైగా వ్యూస్ ఇంకా 2.8 మిలియన్ లైక్స్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో మేకర్స్ కూడా ఈ అంశం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version