పెద్ది: మళ్ళీ పాత ట్యాగ్ కే వచ్చిన రామ్ చరణ్!

ram-charan-peddi

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ అండ్ రస్టిక్ డ్రామా “పెద్ది” కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకింత షాకవుతున్నారని చెప్పాలి. అయితే రామ్ చరణ్ తన 18 ఏళ్ళు కెరీర్లో మెగా పవర్ స్టార్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే.

మొన్న గేమ్ ఛేంజర్ కి ఇపుడు పెద్ది సినిమాకి కూడా వచ్చిన అప్డేట్స్ లో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తోనే అప్డేట్స్ వచ్చాయి. కానీ నేడు పెద్ది నుంచి వచ్చిన పోస్టర్ లో మాత్రం మళ్ళీ మెగాపవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించడం జరిగింది. దీనితో రామ్ చరణ్ మళ్ళీ పాత రూటు లోకే వచ్చాడా లేక కేవలం 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ అలా పెట్టారా అనేది ఫ్యాన్స్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి దీనిపై ఓ క్లారిటీ అయితే నెక్స్ట్ అప్డేట్ తోనే రావచ్చు.

Exit mobile version