పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. పెయిడ్ ప్రీమియర్స్, తొలి రోజు ఈ చిత్రానికి సాలిడ్ వసూళ్లు రావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తొలి రోజు ఈ చిత్రం నైజాం ప్రాంతంలో ఏకంగా రూ.24 కోట్ల షేర్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా రెండో రోజు కూడా జోరు చూపించింది. ఈ చిత్రం నైజాంలో రెండో రోజు రూ.5.9 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఓజీ చిత్రం రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా మూడో రోజు ముగిసేలోపు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటనుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది.