‘మిరాయ్’పై ఐకాన్ స్టార్ ఫిదా.. నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసలు..!

Mirai, AA

టాలీవుడ్‌లో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో కొనసాగుతోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ యోధుడిగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించాయి.

తాజాగా ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్యాషన్, కన్విక్షన్‌తో పర్ఫెక్ట్‌గా ‘మిరాయ్’ చిత్రాన్ని రూపొందించారని.. తేజ సజ్జా డెడికేషన్, హార్డ్ వర్క్‌కు ఫిదా అయ్యానని.. మంచు మనోజ్ విలన్ పాత్రలో ఇరగదీశాడని.. రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు తమ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారని.. గ్రాఫిక్స్ టీమ్, ఆర్ట్, మిక్సింగ్.. ఇలా అందరూ కలిసి ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారని.. అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్‌కు ఫ్యాన్ అయిపోయానని.. ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి చాలా అవసరమని ఆయన తెలిపారు. మిరాయ్ సక్సెస్‌కు చిత్ర టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ అంటూ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Exit mobile version