పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ లెవెల్ హైప్ లో వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్న చూపులు అంతా ఇంతా కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో కూడా గట్టి ఓపెనింగ్స్ ని ఆల్రెడీ ఖాయం చేసుకున్న ఈ సినిమా ఇంకో విషయంలో మాత్రం ఇంకా సీరియస్ స్టెప్ తీసుకోవాలని చెప్పాలి.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో ఊహించని రేంజ్ హైప్ ఉంది. కానీ తమిళ్, హిందీ భాషలో కూడా రాణించాలంటే ప్రమోషన్స్ స్పీడ్ పెంచి తీరాలని చెప్పాలి. తమిళ్ సహా హిందీ మార్కెట్ నుంచి మంచి నటీనటులు సినిమాకి వర్క్ చేశారు. మరి ఈ నెల రోజుల్లో గట్టి ప్రమోషన్స్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం మేకర్స్ స్పీడ్ పెంచాల్సిందే అని చెప్పాలి.