తండ్రీ కూతుళ్ల కాంబినేషన్‌లో ‘దక్ష’: టీజర్ విడుదల, సెప్టెంబర్ 19న రిలీజ్!

Daksha

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో డాక్టర్ మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటించనుండటం విశేషం. తండ్రి–కూతుళ్లు ఒకే ఫ్రేమ్‌లో కలిసి నటించడం ఈ చిత్రానికి మరో ప్రత్యేకత. చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, యు/ఏ సర్టిఫికేట్ పొందింది. కథలోని సందేశాన్ని అభినందిస్తూ సెన్సార్ సభ్యులు చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి పోషించిన టైటిల్ పాత్రను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 19న ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌లో మంచు లక్ష్మి ఇప్పటి వరకు చూడని శక్తివంతమైన పాత్రలో మెరిశారు. ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె యాక్షన్ అవతారం ఆకట్టుకుంది. వింత ఆకారంలో ఎలియన్ లాంటి జీవి దారుణంగా మనుషుల ప్రాణాలు తీయడం, ఓ విచిత్రమైన వ్యాధి ప్రబలడం, దాని వెనుక అసలు రహస్యమేమిటన్న ఆసక్తిని టీజర్ కలిగించింది. సముద్ర ఖని, విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు.

ముఖ్యంగా చివరిలో డాక్టర్ మోహన్ బాబు కనిపించిన ఒక్క దృశ్యం టీజర్ స్థాయిని మరింత పెంచింది. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం వంటిదని సందేశం ఇచ్చింది. మొత్తంగా టీజర్ మంచి ఆసక్తిని రేకెత్తించి, సినిమాపై అంచనాలు నెలకొల్పింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version