తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో తమిళ హీరో విజయ్ నటించిన లియో చిత్ర రికార్డులు కూలీ క్రాస్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
కర్ణాటకలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో లియో లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించింది కూలీ. దీంతో లియో చిత్రాన్ని వెనక్కి నెట్టి కూలీ టాప్ 3లో చోటు దక్కించుకుంది. ఏదేమైనా కూలీ చిత్రంలో కోలీవుడ్ తొలి వెయ్యి కోట్ల బాక్సాఫీస్ వసూళ్ల కల ఇంకా కలగానే మిగిలిపోవడంతో తమిళ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.