మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ విశ్వంభర నుంచి తన పుట్టినరోజు కానుకగా ట్రీట్ ట్రీట్ లాక్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కాకుండా దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ నుంచి కూడా మంచి ట్రీట్ వస్తున్నట్టుగా టాక్ ఆల్రెడీ ఉంది. అయితే దీనిపై మరింత క్లారిటీ తెలుస్తుంది. మేకర్స్ రేపు ఈ సినిమా తాలూకా పరిచయం గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం.
అంతే కాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ శివ శంకర్ ప్రసాద్ పేరిటే కనిపిస్తారని ఇదే టైటిల్ తో అనౌన్సమెంట్ కూడా రాబోతున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. సో మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఇవాళ రేపు పండగే పండగ అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.