టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో స్టార్ బ్యూటీ అనుష్క నటిస్తున్న ‘ఘాటి’ కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ “దస్సోరా” విడుదలైంది. సాగర్ నాగవెల్లి స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునే బీట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాట ఒక్కసారి వినగానే క్యాచీ ట్యూన్‌తో ఇంప్రెస్ చేస్తోంది.
ఇక ఈ పాటలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుంది. గంజాయి రవాణా చేస్తూ వారు పోలీసులకు చిక్కకుండా ఎలాంటి సాహసాలు చేస్తారనేది మనకు ఈ పాటలో చూపెట్టనున్నారు. దీంతో ఈ సినిమా ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో స్పష్టమవుతోంది.
సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో చైతన్య రావు, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.