గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్

Heart-Touching

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూపొందించిన గ్రామీణ ప్రేమకథ చిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ దర్శకత్వం వహించి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది.

ఈ కథ శ్రీకాకుళం గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. రైతుగా మారాలని కలలుకనే తిరుపతి తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు. మరోవైపు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని ఆశపడే కన్యాకుమారి పరిస్థితుల వల్ల బట్టల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంది. విభిన్న ఆశయాలు, కుటుంబ వ్యతిరేకత మధ్య ఇద్దరి ప్రేమకథ మనసుకు హత్తుకునేలా ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

సృజన్ అట్టాడ అందించిన సహజమైన కథనంతో పాటు, శివ గాజుల, హరిచరణ్ కె తీసిన అద్భుతమైన దృశ్యాలు రవి నిడమర్తి అందించిన హృద్యమైన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా చేస్తుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 27న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version