‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?

peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న భారీ చిత్రం “పెద్ది”. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం పెద్ది మ్యూజికల్ ట్రీట్ అతి త్వరలోనే రానుంది అని టాక్. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరి తాను సమకూర్చిన ఫస్ట్ సింగిల్ కి డేట్ లాక్ అయ్యిందట. ఈ ఆగస్ట్ లో రాబోతున్న వినాయక చవితి కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేస్తారని రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో దివ్యెందు శర్మ, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version