నార్త్ ఇండియాలో ‘కూలీ’ చిత్రాన్ని రిలీజ్ చేసేది వీరే..!

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ నుంచి రానున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘కూలీ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ కాగా ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నార్త్‌లో తెరకెక్కిన ‘వార్-2’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో కూలీ చిత్రాన్ని హిందీలో ఎవరు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. నార్త్ బెల్ట్‌లో కూలీ చిత్రాన్ని పెన్ మారుధర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఒకవైపు యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి భారీ స్థాయిలో వార్-2 రిలీజ్ అవుతుండటంతో, ఇప్పుడు కూలీ హిందీ బెల్ట్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

Exit mobile version