‘కూలీ’ నుంచి మూడో సింగిల్ సాంగ్‌గా ‘పవర్‌హౌజ్’.. రిలీజ్ అయ్యేది ఎప్పుడు, ఎక్కడంటే..?

Rajinikanth and Lokesh Kanagaraj's Coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘కూలీ’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ ‘పవర్‌హౌజ్’ను జూలై 22న రాత్రి 9.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ లాంచ్‌ను హైదరాబాద్‌లోని క్వేక్ అరెనాలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనుండటంతో ప్రమోషన్స్‌ను కూడా వివిధ నగరాల్లో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సౌభిన్ షాహిర్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version