న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హై వోల్టేజ్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తోనే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.
ఇక ప్రస్తుతం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్నారు. ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా ఈ సీక్వెన్స్‌లో పనిచేస్తున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.