‘1 నేనొక్కడినే’ విషయంలో సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అందులో ఇంట్రెస్టింగ్ జానర్ సినిమాలు కనిపిస్తాయి. అలాగే మహేష్ నుంచి మంచి సందేశాత్మక చిత్రాలుతో పాటుగా క్రేజీ ప్రయోగాత్మక సినిమాలు కూడా కనిపించాయి. మరి అలా వచ్చిన ప్రయోగాత్మక చిత్రాల్లో దర్శకుడు సుకుమార్ తో చేసిన సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం “1 నేనొక్కడినే” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా ఇండియాలో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యినా యూఎస్ మార్కెట్ లో మాత్రం మంచి ఆదరణ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా తానా సభల్లో హాజరైన సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

1 నేనొక్కడినే సినిమా యూఎస్ ఆడియెన్స్ కానీ ఆదరించకుండా ఉంటే తనకి మరో సినిమా అవకాశం వచ్చి ఉండేది కాదని మీరు ఆదరించడం వల్లే 1 నేనొక్కడినే తర్వాత మరో సినిమా అవకాశం వచ్చింది. మీకెప్పుడూ నేను ఋణపడి ఉంటానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీనితో తన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version