బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న మరో అవైటెడ్ భారీ చిత్రమే “రామాయణ”. ఇదే బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి హీరో రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రెండు భాగాల రామాయణంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుండగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా గ్లింప్స్ ని విడుదల చేసేందుకు తేదీ, సమయం ఖరారు చేసేసారు. ఈ జూలై 3న ఉదయం 11 గంటల 30 నిమిషాలకి గ్రాండ్ ఈవెంట్ తో వీటిని రివీల్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా సహా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా నిర్మాణం వహిస్తూ రావణ పాత్ర పోషిస్తున్నాడు.