‘హను మాన్’ ఖాతాలో ఒక అరుదైన రికార్డు.. ఏంటంటే!

మన టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది “హను మాన్” అనే చెప్పాలి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యిన సూపర్ హీరో సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత సృష్టించిన విధ్వంసం కోసం తెలుగు ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మేకర్ ప్లస్ పాయింట్స్ లో సంగీత దర్శకుడు గౌర హరి పనితనం కూడా ఒకటి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు గాని పెద్ద హిట్ అయ్యాయి. ఇలా తన ఆల్బమ్ ఇపుడు హను మాన్ కి మరో అరుదైన రికార్డు సెట్ చేసి పెట్టింది.

హను మాన్ ఆల్బమ్ కి ఇపుడు ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దక్కాయట. మరి ఇలా ఓ సినిమా ఆల్బమ్ కి 1 బిలియన్ వ్యూస్ దక్కడం అనేది చాలా రేర్ అంశమే అని చెప్పాలి. అలాంటిది ఈ సినిమాకి కూడా రావడం విశేషం. ఇక ఇదే తేజ సజ్జ, గౌర హరి కలయికలో మరో సూపర్ హీరో తరహా సినిమా “మిరాయ్” రాబోతుంది. ఇదెలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version