టాక్.. తలైవర్ తో ‘ఖాకీ’ దర్శకుడు?

ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమాలలో ఒకటి ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇక మరో సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలు కాకుండా నెక్స్ట్ సినిమాలుగా రజినీకాంత్ నుంచి ఎవరితో ఉంటాయి అనేది ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటకి రాలేదు.

ఇక తన లైనప్ పై ఓ సాలిడ్ బజ్ ఇపుడు బయటికి వచ్చింది. దీనితో యువ దర్శకుడు హెచ్ వినోద్ తో తలైవర్ వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్ తో జన నాయగన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రజినీని రెండు సార్లు కలిశాడట.

మరి ఈ కలయికలోనే సినిమా ఓకే చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. వినోద్ నుంచి ఖాకీ, వలిమై, తునివు లాంటి సాలిడ్ హిట్స్ ఉన్నాయి. అలాగే ఖాకీ 2 కూడా కార్తీతో ఉందని టాక్ ఉంది. సో ఇలాంటి దర్శకునితో రజిని కాంబినేషన్ అంటే అంచనాలు పెట్టుకోవచ్చు.

Exit mobile version