‘పెద్ది’తో ప్రేమలో పడిపోయిన బుచ్చిబాబు.. హైప్ ఎక్కించేస్తున్నాడుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కి స్తుండగా, ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్న ‘పెద్ది’ చిత్ర సెట్స్ నుంచి బుచ్చిబాబు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ఎంతో ఇష్టంగా ఓ సెల్ఫీ ఫోటో తీసుకున్నారు. దీనికి ‘ఆరేంజ్’ చిత్రంలోని లవ్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేసి.. చరణ్‌పై తనకున్న ప్రేమను ఈ ఫోటో రూపంలో వ్యక్తపరిచాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చరణ్‌తో బుచ్చిబాబు బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version