ట్విస్ట్.. ట్రాక్ లో నితిన్ తమ్ముడు(డే)!?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన సినిమా “తమ్ముడు” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించగా ఆ మధ్య ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే జూలై 4 డేట్ కి ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా డేట్ లోనే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ భారీ చిత్రం “కింగ్డమ్” కూడా అనౌన్స్ చేశారు.

అయితే అంతా తమ్ముడు సినిమా వెనక్కి వెళుతుంది అని అప్పుడు అనుకున్నారు కానీ లేటెస్ట్ గా ట్విస్ట్ ఏమిటంటే తమ్మడు సినిమా ఇప్పటికీ ట్రాక్ లోనే ఉందట. ఎలాంటి ఫస్ట్ సింగిల్ రానప్పటికీ ఇదే డేట్ లో సినిమా వస్తుందని వినిపిస్తుంది. కానీ కింగ్డమ్ మళ్ళీ వాయిదా పడొచ్చు అని కొత్త టాక్. మరి ఇందులో ఎంతమేరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

Exit mobile version