పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి పవన్ కళ్యాణ్ తన పాత్ర కోసం షూటింగ్ ముగించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ‘గంభీర’ అనే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇక గంభీర ముగించాడని ఓజి మేకర్స్ తెలపడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.