బిగ్ అప్డేట్ : అల్లు అర్జున్-అట్లీ మూవీ నుంచి రానున్న సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను AA22xA6 అనే ట్యాగ్‌తో పిలుస్తున్నారు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ అప్డేట్‌ను రేపు(జూన్ 7) ఉదయం 11 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే ఈ సినిమాలో పలువురు హీరోయిన్లు నటించనున్నారని.. ఇందులో తొలి హీరోయిన్ పరిచయం రేపు జరుగుతుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. మరి AA22xA6 ప్రాజెక్ట్ నుంచి రాబోతున్న ఈ బిగ్ అప్డేట్ ఏమిటో తెలియాలంటే రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version