మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రవితేజ హీరోగా అంతే ఎనర్జిటిక్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “మాస్ జాతర”. రవితేజకి కలిసొచ్చిన మాస్ ఎంటర్టైనర్ జానర్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆల్రెడీ మంచి హైప్ ఉంది.
ఇక దీనికి తగ్గట్టుగా ఇపుడు వదిలిన ఫస్ట్ సింగిల్ కూడా విన్న వెంటనే సూపర్ హిట్ అని చెప్పడంలో డౌట్ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మ్యాజిక్ చేసాడని చెప్పాలి. దివంగత సంగీత దర్శకుడు చక్రి మ్యూజిక్ కానీ తన వాయిస్ గాని ఎంత స్పెషల్ అని అందరికీ తెలిసిందే. మరి తన వాయిస్ తో ట్రై చేసిన ఈ ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది అని చెప్పాలి.
వీటితో పాటుగా రవితేజ ఎనర్జీ ఇందులో బిగ్గెస్ట్ హైలైట్. మధ్యలో ఇడియట్ ట్యూన్ కి రవితేజ అలా స్టెప్పేస్తుంటే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. దీనితో పాటుగా శ్రీలీల కూడా మరోసారి రవితేజతో అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ తో మేకర్స్ ఫస్ట్ చార్ట్ బస్టర్ ని కొట్టేశారని చెప్పవచ్చు.