ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి గేమ్ ఛేంజర్ తో కొట్టని సక్సెస్ ని తమ అభిమాన హీరో ఈ సినిమాతో అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమా మొదలు కానీ సమయం నుంచే దర్శకుడు బుచ్చిబాబు సహా ఇతర యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఈ సబ్జెక్టు విషయంలో ఉన్నారు.
అయితే ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు నేడు కావున చిత్ర యూనిట్ సినిమా సెట్స్ నుంచి తన పుట్టినరోజు కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేయగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బుచ్చిబాబుకి తన విషెష్ ని బ్యూటిఫుల్ ఫోటోతో షేర్ చేశారు. మరి ఇందులో చరణ్ ను బుచ్చిబాబు ఆప్యాయంగా కౌగిలించుకొని కనిపిస్తున్నారు. దీనితో ఈ స్పెషల్ మూమెంట్ ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.