నాగచైతన్య కెరీర్ లోనే సరికొత్త రికార్డు !

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.62.47 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా తెలిపింది. అక్కినేని నాగచైతన్య కెరీర్లో ఇవే అత్యంత వేగవంతమైన కలెక్షన్లని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

కొన్ని బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్ ప్రదర్శన చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. ఇలా ప్రదర్శన చేయడం చట్టవిరుద్ధమని, సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడిన వారికి అవమానమని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version