సూపర్ హీరోగా సూర్య? క్రేజీ డైరెక్టర్ తో ప్రాజెక్ట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇపుడు సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన “కంగువా” సినిమా డిజప్పాయింట్ చేసింది కానీ ఈ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “రెట్రో” పై భారీ హైప్ ఇపుడు నెలకొంది. ఇక ఈ చిత్రం తర్వాత మరిన్ని సినిమాలు ఉండగా వాటిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సూర్య ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అది కూడా తాను ఒక సూపర్ హీరో సబ్జెక్టుకి ఓకే చెప్పినట్టుగా టాక్.

మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అతి తక్కువ సూపర్ హీరో చిత్రాల్లో మళయాళ సినిమా నుంచి వచ్చిన ఫైనెస్ట్ సూపర్ హీరో చిత్రం “మిన్నల్ మురళి” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అలాగే ప్రముఖ నటుడు బాసిల్ జోసెఫ్ తో ఓకే అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం పలు రూమర్స్ ఇది కూడా సూపర్ హీరో సబ్జెక్టు అన్నట్టుగా టాక్ నడుస్తుంది కానీ ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version