కథను వినగానే ఫలితం అర్థమైపోవాలి – మహేష్ బాబు

Mahesh-Babu

మొన్న డైనమిక్ పోలీస్ ఆఫీసర్, నిన్న నెగటివ్ షేడ్స్ ఉన్న సూర్య భాయ్, ఆ తర్వాత పిల్లల్ని, పెద్దల్ని, అమ్మాయిల్ని ఆకట్టుకునే చిన్నోడు, ఇలా వరుసగా విభిన్న పాత్రలతో హాట్రిక్ హిట్స్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన చిన్నోడుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కథలు విన్నప్పుడు బాగుంటాయి తీసినప్పుడు తేడాలొచ్చాయి అంటుంటారు దానిమీద మీ అభిప్రాయం ఏమిటి అని మహేష్ బాబుని అడిగితే ‘ అదంతా వట్టి మాటలండి. దర్శకుడు సినిమా కథ చెబుతున్నప్పుడే ఫలితం ఎలా ఉంటుందా అని మనకు తెలిసిపోవాలి. అలా కాకుండా షూట్ చేస్తున్నప్పుడు సెట్లో తెలిసింది అని చెప్పారంటే కప్పి పుచ్చుకోవడానికి చెప్పుకుంటున్నారని అర్థం చేసుకోవాలి చెప్పిన కథని బాగా తీస్తే ప్రేక్షకాదరణ పొందవచ్చని’ సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Exit mobile version