జబర్దస్త్ రిలీజ్ డేట్ ఖరారు

Jabardasth
క్లాస్ హీరో సిద్దార్థ్, అందాల భామ సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన ‘జబర్దస్త్’ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. నిత్యా మీనన్, శ్రీ హరి కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో జరిగింది.

ఈ వేడుకకి సిద్దార్థ్, సమంత, వి.వి వినాయక్, రానా,సునీల్, గుణ్ణం గంగరాజు, కోన వెంకట్, తాగుబోతు రమేష్, దామోదర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సిద్దార్థ్, సమంత తమ మాస్ లుక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోనున్న ఈ సినిమా రైట్స్ విషయంలో ఇప్పటికే లాభం పొందారని బెల్లంకొండ సురేష్ తెలిపాడు. అలాగే ఫిబ్రవరి 21న ‘గుండెల్లో గోదారి’ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనుంది.

Exit mobile version