క్రేజీ కాంబినేషన్లో కామెడీ మెయిన్ హైలెట్

pawan-kalyan-trivikram
క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెల ఫిబ్రవరి నుండి పొల్లాచ్చిలో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో కామెడీ మెయిన్ హైలెట్ కానుందని. పవన్, త్రివిక్రమ్ గత చిత్రం జల్సా కంటే ఇప్పుడు తెరకెక్కబోతున్న సినిమాలో ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుందని సమాచారం. మాటలతోనే కాదు కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎంత నవ్విస్తాడు అనేది వేచి చూడాలి.

Exit mobile version